కేసీఆర్ ప్రధానమంత్రి అయితే బ్యాంకులన్నీ అభివృద్ధి బాటలో పయనిస్తాయని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసిసోయేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు.
బ్యాంకు ఉద్యోగుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే దేశ వ్యాప్త సమ్మె చేసేందుకు సిద్ధమని హెచ్చరించారు. ప్రభుత్వ బ్యాంకులనుఉ ప్రైవేట్ బ్యాంకుల్లో విలీనం చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఏపీ,తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాచిగూడలో జరిగిన మొదటి సదస్సును ప్రారంభించిన ఆయన ప్రభుత్వ రంగ బ్యాంకులను రిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందన్నారు.
ఎగవేతదారులు వివిధ బ్యాంకులలో తీసుకున్న మొండి భకాయిలను కట్టేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంక్ జనరల్ మేనేజర్(హెచ్‌ఆర్)ఎం నాగరాజు, యాగుల్ జే రాయలా, ప్రధాన కార్యదర్శి పీవీ కృష్ణారావు, రవీంద్రనాథ్, తెలంగాణ, ఏపీ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన్నారు.