విలేజ్‌ రాక్‌స్టార్స్‌ ఆస్కార్‌కు ఎంపిక..

312
Village Rockstars
- Advertisement -

ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డ్‌ని సొంతం చేసుకున్న అస్సామీ మూవీ.. విలేజ్ రాక్ స్టార్స్ మరో ఘనతను సొంతం చేసుకుంది. 2019లో జరగబోయే ఆస్కార్ అవార్డుల కోసం ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా విలేజ్ రాక్ స్టార్స్ ఎంపికైంది.. రీమా దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అస్సాం జన జీవనాన్ని తెరపై ఆవిష్కరించి.. ఈశాన్య భారతానికి విశిష్ట గుర్తింపును తెచ్చి పెట్టింది. అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా జ‌రిగే అవార్డుల ఫంక్ష‌న్ ఆస్కార్ వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 24న జ‌ర‌గ‌నుంది.

Village Rockstars

91వ ఆస్కార్ అవార్డులకి గాను భార‌త్ నుండి 28 చిత్రాలు కాగా ఇందులో విలేజ్ రాక్‌స్టార్స్ నామినేషన్‌కి ఎంపకైంది. ఈ చిత్రం 2017లో టోరంటో ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ప్రీమియ‌ర్ జ‌రుపుకుంది. 2018లో ఉత్తమ ఫీచ‌ర్ సినిమాగా స్ద‌ర్ణ క‌మ‌ల్‌ జాతీయ అవార్డు అందుకుంది. బెస్ట్ చైల్డ్, బెస్ట్ లొకేష‌న్ సౌండ్ రికార్డిస్ట్‌, బెస్ట్ ఎడిటింగ్ విభాగాల‌లోను ఈ చిత్రం జాతియ అవార్డుల‌ని అందుకుంది. బ‌నిత దాస్‌, మ‌న‌బేంద్ర దాస్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన విలేజ్ రాక్ స్టార్స్ చిత్రం ఆస్కార్ నామినేష‌న్‌కి ఎంపిక కావ‌డం ప‌ట్ల చిత్ర బృందం హ‌ర్షం వ్య‌క్తం చేస్తుంది.

- Advertisement -