నాటకం సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఆశిష్ గాంధీ, ఆశిమా నెర్వల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని కళ్యాణ్ జీ గోగన తెరకెక్కించారు. గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన నాటకం షూటింగ్ చాలా రోజుల కిందే పూర్తయింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తైపోయింది. దాంతో దర్శక నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కథే ప్రధానంగా ఈ చిత్రం సాగనుంది. సాయికార్తిక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పిఎస్వి గరుడవేగ ఫేమ్ అంజి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. శ్రీ సాయిదీప్ చట్లా, రాధికా శ్రీనివాస్,ప్రవీణ్ గాంధీ, ఉమా కూచిపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రిజ్వాన్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ సమర్పణలో నాటకం సినిమా వస్తుంది. నటీనటులు: ఆశిష్ గాంధీ, ఆశిమా నెర్వాల్ తదితరులు.. సాంకేతిక విభాగం: దర్శకుడు: కళ్యాణ్ జీ గోగన,సమర్పణ: రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్,నిర్మాతలు: శ్రీ సాయిదీప్ చట్లా, రాధికా శ్రీనివాస్,ప్రవీణ్ గాంధీ, ఉమా కూచిపూడి, సంగీతం: సాయికార్తిక్, సినిమాటోగ్రఫీ: గరుడవేగ ఫేమ్ అంజి,ఎడిటర్: మణికంఠ్,పిఆర్ఓ: వంశీ శేఖర్.