మెట్రో సెకండ్‌ ఫేజ్ లాంచింగ్‌కి అంతా రెడీ

320
ktr Metro
- Advertisement -

భాగ్యనగర వాసుల ట్రాఫిక్ కష్టాలు మరింత తగ్గించేందుకు మెట్రో సెకండ్ ఫేజ్ అందుబాటులోకి రానుంది. దేశంలోనే అత్యాధునిక సాంకేతికతో హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)తో నిర్మించింది. తొలిదశలో 30 కిలోమీటర్ల మేర మెట్రో అందుబాటులోకి సెకండ్ ఫేజ్‌లో ఎల్బీనగర్-అమీర్ పేట మెట్రో రైలు మార్గం అందుబాటులోకి రానుంది. 16 కిలోమీటర్ల ఈ మార్గాన్ని ఈ నెల 24న మధ్యాహ్నం 12.15 గంటలకు గవర్నర్ నరసింహన్‌ ప్రారంభించనున్నారు.

హైదరాబాద్ మెట్రోలో రెండో దశ అయిన అమీర్‌పేట – ఎల్‌బీ నగర్ మార్గమే అత్యంత కీలకం. అమీర్‌పేట, లక్డీకాపూల్, అసెంబ్లీ, నాంపల్లి, కోటి, మహాత్మా గాంధీ బస్ స్టేషన్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్ లాంటి ప్రముఖ ప్రాంతాలను కలిపే ఈ మార్గంలో ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభించే అవకాశం ఉంది.

KTR

ఈ మార్గంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, షాపింగ్‌మాళ్లు వంటివి అధికంగా ఉండటం వల్ల మెట్రోరైలు.. ప్రజలకు ఎంతో సౌలభ్యంగా మారుతుంది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ దాకా ప్రయాణ సమయం 50% నుంచి 70% దాకా తగ్గుతుంది.

ఇప్పటికే ఈ రూట్‌లో ట్రయల్ రన్‌ నిర్వహించారు అధికారులు. మంత్రి కేటీఆర్‌ సైతం ఎల్బీనగర్‌ నుండి అమీర్‌ పేట మార్గంలో మెట్రలో ప్రయాణించారు.మెట్రో స్టేషన్ల పరిధిలో ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా ఆర్టీసీ చర్యలు చేపడుతోంది. దీనికి తోడు గ్రేటర్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టనున్నారు.

ప్రస్తుతం నాగోల్-అమీర్ పేట మార్గంలో మెట్రో రైళ్లు సక్సెస్‌ ఫుల్‌గా నడుస్తున్నాయి. ప్రతీ రోజు 80 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.

- Advertisement -