పసికూనపై చెమటోడ్చిన రోహిత్ సేన…

245
India vs Hong Kong
- Advertisement -

ఆసియా కప్‌లో భాగంగా పసికూన హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన చమటోడ్చి విజయం సాధించింది. భారత్ విధించిన 286 పరుగల లక్ష్య ఛేదనలో భారతకు చెమటలు పట్టించింది. ఓపెనర్లు నిజాకత్(92),అన్షుమన్(73) రాణించడంతో ఓ దశలో విజయం దిశగా దూసుకుపోయింది హాంకాంగ్.

ఈ దశలో భారత బౌలర్ల రాణించడంతో టీమిండియా విజయం ఖాయమైంది. నిర్ణీత ఓవర్లలో హాంకాంగ్ 8 వికెట్లు కొల్పోయి 259 పరుగులు చేసింది. 26 పరుగుల తేడాతో నెగ్గిన భారత్ ఊపిరి పీల్చుకుంది. 30 ఓవర్లలో 142/0తో నిలిచిన హాంకాంగ్ 35వ ఓవర్లో తొలి వికెట్ కొల్పోయింది. తర్వాతి ఓవర్లోనే.. జోరు మీదున్న మరో ఓపెనర్‌ నిజాకత్‌ను ఖలీల్‌ ఔట్‌ చేయడంతో భారత్‌ కాస్త ఊపిరిపీల్చుకుంది. ఓపెనర్లు ఔటయ్యాక హాంకాంగ్‌ ఒత్తిడిలో పడి ఓడిపోయింది.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్నిచ్చారు. ముఖ్యంగా టీమిండియా ఇన్నింగ్స్‌లో ధావన్‌ బ్యాటింగ్ హైలైట్. ఇంగ్లాండ్‌లో విఫలమైన ధావన్‌ పసికూనపై చెలరేగిపోయాడు. 120 బంతుల్లో… 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 127 పరుగులు చేసి సత్తా చాటాడు. వన్డేల్లో ధావన్‌కు ఇది 14వ సెంచరీ. ధావన్‌కు తోడుగా అంబటి రాయుడు(60) రాణించడంతో భారత్‌ భారీ స్కోరు దిశగా పయనించింది. అయితే చివర్లో లోయర్ ఆర్డర్ తడబడటంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. అరంగేట్ర బౌలర్‌ ఖలీల్‌ అహ్మద్‌ (3/48) చక్కటి ప్రదర్శన చేశాడు.

- Advertisement -