దుమ్మురేపుతున్న దురై’సింగం’..

256
Online News Portal
Suriya returns as hot-headed cop in S3
- Advertisement -

సూర్య హీరోగా వచ్చిన సింగం-1, సింగం-2లకు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింగం’ సీక్వెల్‌ ‘సింగం 3’ షూటింగ్‌ పూర్తి అయిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో సెట్స్‌ మీదకు వెళ్లిన ఈ మూవీ పది నెలల పాటు చిత్రీకరణను జరుపుకుంది. చెన్నై, హైదరాబాద్‌, వైజాగ్ తదితర ప్రాంతాలలో షూటింగ్‌ను జరుపుకున్న ఈ మూవీకి ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ (తమిళం) విడుదలైంది. స్టూడియో గ్రీన్‌ నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అనుష్క, శృతిహాసన్‌లు కథానాయికలు.

సింగం సిరీస్‌లో మూడో భాగమైన ఈ చిత్రంలో 2015 మిస్టర్‌ వరల్డ్‌, బుల్లితెర నటుడు థాకూర్‌అనూప్‌ సింగ్‌ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఈ చిత్రానికి హేరిస్‌ జయరాజ్‌ స్వరాలు సమకూర్చారు. ఎస్‌-3కి ముందు వచ్చిన ‘యముడు’, ‘సింగం’ సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘సింగం’ సిరీస్‌లో సూర్యతో పాటు అనుష్క కామన్‌ పాయింట్‌ అయితే ఎస్‌-3లో కొత్తగా శృతిహాసన్‌ వచ్చి చేరారు.

కాగా, సింగం-3 సినిమాని దీపావళికే విడుదల చేయాలని ఎస్‌ టీం ప్లాన్ చేశారు. తమ్ముడు కార్తీ కాష్మోరా కోసం తన సినిమాను వాయిదా వేసుకున్నాడు. తెలుగు, తమిళంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్‌ 16వ తేది ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -