బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై మండిపడ్డారు కేటీఆర్. టీఆర్ఎస్ సర్కార్‌పై షా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తాము ప్రజలకు భయపడతాం…మోడీకి కాదంటూ చురకలంటించారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని భారతీయ ఝూటా పార్టీ అని అభివర్ణించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై మాట్లాడిన అమిత్ షా…మోడీ,వాజ్‌పేయ్ ప్రభుత్వాలు ముందస్తుకు పోలేదా అని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కలలు కంటున్నారంటూ ఎద్దేవా చేశారు. అమిత్ షా కాదు.. భ్రమీషా అంటూ చురకలంటించారు. తమకు పోటీ కాంగ్రెస్ పార్టీతోనే అని స్పష్టం చేశారు. ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఉన్న 5 ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ గెలుచుకోగలదా అని ప్రశ్నించారు. గ్రేటర్ పరిధిలో ఒక్క కార్పొరేటర్ గెలవని బీజేపీ తమకు ఎలా ప్రత్యామ్నాయం అవుతుందని ప్రశ్నించారు.
While BJP president Amit Shah may dwell on political rhetoric on KCR Garu & Telangana Govt, his own BJP ruled Uttar Pradesh Govt’s delegation led by Agriculture Minister is trying to learn from Telangana initiatives in Farming 😊 pic.twitter.com/Q5N2UokVWr
— KTR (@KTRTRS) September 17, 2018
వ్యవసాయరంగానికి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న చేయూత దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఉత్తరప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సూర్యప్రతాప్ కొనియాడారని గుర్తుచేశారు. దేశంలో వ్యవసాయరంగంపై ఏ రాష్ట్రం వెచ్చించనంత బడ్జెట్‌ను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెడుతున్నదని అన్న విషయాన్ని గుర్తుచేశారు.