ప్రశాంత్ కిశోర్..భారతదేశ రాజకీయాలపై కాసింత అవగాహన ఉన్న వారికి పరిచయం అక్కర్లేని పేరు. 2014 ఎన్నికల్లో ప్రధానిగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టడంలో కీలక పాత్ర పోషించారు. సోషల్ మీడియా ద్వారా మోడీ పాపులారిటీని పెంచిన ప్రశాంత్ ఆ ఎన్నికల్లో బీజేపీని తిరుగులేని శక్తిగా నిలపడంలో తనవంతు పాత్రను పోషించారు. తాజాగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రశాంత్…జేడీయులో చేరారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
బిహార్‌లోని సాసారామ్ ప్రాంతానికి చెందిన ప్రశాంత్ కిశోర్..వచ్చే ఎన్నికల్లో బక్సర్ ఎంపీ స్ధానానికి పోటీ చేయనున్నారు. 2015లో బీహార్‌లో మహాకూటమి అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించారు. బిహార్ నుంచి నా కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్నందుకు చాలా ఉత్సాహంగా ఉందని ఈ సందర్భంగా ట్వీట్ చేశారు ప్రశాంత్. ప్రశాంత్ మా పార్టీ భవిష్యత్ అని పేర్కొన్నారు నితీష్ కుమార్.
అనంతరం జరిగిన ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా పనిచేసిన కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకురావడంలో విఫలమయ్యారు. కానీ తర్వాత పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం ఏపీలో వైసీపీ తరపున ఎన్నికల వ్యుహకర్తగా ఉన్నారు.