ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ 68వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. చాయ్ వాలా నుంచి ప్రధానిగా ఎదిగిన మోడీ భారత దేశ రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. సెప్టెంబర్ 17,1950లో గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలో జన్మించారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మోడీ…చిన్నప్పుడే బీజేపీ అనుబంధ ఆరెస్సెస్‌లో చేరారు. విద్యార్థి నాయకుడిగా పనిచేశారు. 1987లో బీజేపీ సభ్యత్వం తీసుకున్న మోడీ కొద్దికాలంలోనే అగ్రనేతల దృష్టిని ఆకర్షించారు. 1990లో అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు ఇంఛార్జీగా పనిచేశారు.
2001లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి కేశూభాయ్ పటేల్ రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు మోడీ. అప్పటినుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో మోడీకి తిరుగులేకుండా పోయింది. వరుసగా నాలుగు సార్లు గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రిగా గుజరాత్‌ను ప్రగతిపథంలోకి నడిపిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు.
2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్డీఏను విజయపథంలో నడిపించి పూర్తి మెజారిటీ సాధించిపెట్టి 2014 మే 26న ప్రధానమంత్రి పీఠంపై అధిష్టించారు. ప్రధానమంత్రిగా మోడీ పలు వివాదాస్పదమైన నిర్ణయాలు, పాలసీలు అమలుచేశారు. 500, 1000 రూపాయల నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి రద్దుతో సంచలనం సృష్టించారు.
పలువురు ప్రముఖులు మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మన ప్రధానికి పుట్టిన రోజు శుభాకాంఫలు. మీరు మంచి ఆరోగ్యంతో, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని రాహుల్,ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ ద్వారా మోడీకి విషెస్ తెలిపారు.
ద్వారా మోదీకి విషెస్ తెలిపారు.
తన నియోజకవర్గమైన వారాణాసిలో చిన్నారుల నడుమ తన బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మోడీ. రెండు రోజుల పర్యటనలో వారణాసిలో పర్యటించనున్న మోడీ.. నారూర్ గ్రామానికి వెళ్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించనున్నారు. తన జీవిత విశేషాలతో రూపొందించిన సినిమాను వీక్షించనున్నారు. అనంతరం చిన్నారులతో కలిసి పుట్టినరోజును జరుపుకోనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.