నా కొడుకు ఏం తప్పుచేశాడు:కేటీఆర్

239
ktr interview
- Advertisement -

కేసీఆర్ బాగుంటే తాము బాగుంటామని ప్రజలు భావిస్తున్నారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికల సందర్భంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కేటీఆర్…టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్‌ కేసీఆర్‌ అని తెలిపారు. తెలంగాణలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌ కనిపిస్తోందన్నారు. రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ పాలన సాగాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.

సాగునీరు తెలంగాణను సస్యశ్యామలం చేస్తుందన్న ఉద్దేశంతో కేసీఆర్‌ ప్రయత్నం చేస్తుంటే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెస్‌ 186 కేసులు వేసిందని మండిపడ్డారు. తెలంగాణకు నీళ్లు రాకూడదు. ఏ ఉద్యోగ నియామకానికి నోటిఫికేషన్‌ ఇచ్చినా.. కోర్టు ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారి దుయ్యబట్టారు. చివరకు.. చనిపోయిన వ్యక్తుల పేరు మీద దొంగ వేలి ముద్రలు వేసి కేసులు వేసిన దౌర్భాగ్యపు చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని ఆరోపించారు. చివరికి నా కొడుకు ఏం తప్పు చేశాడని..అతని శరీరాకృతిపైనా మాట్లాడి విషం చిమ్ముతున్నారని చెప్పారు. ఇలా వ్యక్తిగతంగా మాట్లాడుతూ విషం చిమ్ముతుంటే రాజకీయాల్లో ఉండటం అవసరమా అనిపిస్తుందన్నారు.

బీజేపీతో మాకు ఎలాంటి పొత్తు, అవగాహన లేదని ఆ ఆలోచనే మాకు రాదని తెలిపారు. ముందస్తు ఎన్నికలతో మోడీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. ప్రజా ప్రయోజనాలు మరిచి, టీఆర్‌ఎస్‌ ఓటమి ప్రాతిపదికగా పొత్తులు పెట్టుకుంటున్నాయి. ఇంతకంటే బేవకూఫ్‌ ముచ్చట నా జీవితంలో వినలేదన్నారు.

యుద్ధంలో మనం బలపడడం ఎంత ముఖ్య మో.. అవతలివాడు బలహీనపడడం కూడా అంతే ముఖ్యమన్నారు. టీఆర్‌ఎస్‌ గెలిచే అవకాశం లేకపోతే, 105 మంది అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కూడా ఈ చేరికలు ఎందుకుంటాయని ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రారంభించిన పథకాలన్నీ కొనసాగుతాయని…. ముఖ్యంగా సంక్షేమం టార్గెట్‌. రెండోది.. పట్టణ మౌలిక సదుపాయాలను బాగు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

- Advertisement -