బిగ్ బాస్ విన్న‌ర్ ఆర‌వ్ `రాజ భీమా` ఫ‌స్ట్ లుక్

244
Raja Bheema
- Advertisement -

రియాలిటీ షోల్లో బిగ్ బాస్ ఎంత‌టి సంచ‌ల‌నం క్రియేట్ చేస్తోందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌మిళంలో క‌మ‌ల్ హాస‌న్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన‌ బిగ్ బాస్ సీజ‌న్ 1లో విజేత అర‌వ్ ఇప్పుడు వెండితెర‌పై సంద‌డి చేయ‌నున్నారు. అర‌వ్ హీరో న‌టిస్తున్న చిత్రం `రాజ భీమా`. సుర‌భి ఫిలింస్ బ్యాన‌ర్‌పై న‌రేశ్ సంప‌త్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత ఎస్‌.మోహ‌న్ మాట్లాడుతూ “ఆర‌వ్‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా భారీ బ‌డ్జెట్‌తో.. వైవిధ్య‌మైన క‌థాంశంతో.. బ్యూటీఫుల్ లొకేష‌న్స్‌లో రాజ భీమా చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ద‌ర్శ‌కుడు న‌రేశ్ సంప‌త్ అద్భుత‌మైన క‌థ‌, క‌థ‌నంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన మ‌రిన్ని విష‌యాల‌ను తెలియ‌జేస్తాం“ అన్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ: ఎస్‌.ఆర్‌.స‌తీశ్ కుమార్‌, మ్యూజిక్‌: సైమాన్ కె.కింగ్‌, ఎడిటింగ్‌: గోపీ కృష్ణ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌: క‌రుణ్‌దేల్ రాజేశ్‌, ఆర్ట్‌: ఎ.ఆర్‌.మోహ‌న్‌, స్టంట్స్‌: హ‌రి దినేశ్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కె.బి.బ‌షీర్ అహ్మద్‌, ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌.మోహ‌న్‌, ద‌ర్శ‌క‌త్వం: న‌రేశ్ సంప‌త్‌.

Raja Bheema

- Advertisement -