నేటి నుంచే ఆసియా కప్ సంగ్రామం మొదలుకానుంది. మినీ ప్రపంచకప్ లాంటి ఈ టోర్నీలో ఆసక్తికర పోరు జరగనుంది. భారత్-పాక్ తలపడే మ్యాచ్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆరు జట్లు పోటీ పడుతున్న ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో తలపడనుండటం విశేషం. ఇక ఇవాళ జరిగే ఆరంభ పోరులో శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడనున్నాయి.
ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఆసియా కప్ కొత్త ఫార్మాట్‌లో రాబోతుంది. టోర్నీలో తలపడుతున్న ఆరు జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్ మూడు జట్లుంటాయి. అవి పరస్పరం తలపడతాయి. రెండు గ్రూప్‌ల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-4 దశకు అర్హత సాధిస్తాయి. అక్కడ ప్రతి జట్టూ మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఆ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు వెళ్తాయి.
పూల్ ‘ఎ’ (భారత్, పాకిస్తాన్, హాంకాంగ్), పూల్ ‘బి’ (శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్)గా వర్గీకరించారు.
షెడ్యూల్:
() సెప్టెంబర్ 15 – బంగ్లాదేశ్ × శ్రీలంక
() సెప్టెంబర్16 – పాకిస్థాన్ × హాంకాంగ్
()సెప్టెంబర్17 – శ్రీలంక × అఫ్గానిస్తాన్
()సెప్టెంబర్18 – భారత్ × హాంకాంగ్
() సెప్టెంబర్19 – భారత్ × పాకిస్థాన్
()సెప్టెంబర్20 – బంగ్లాదేశ్ × అఫ్గానిస్థాన్
() సెప్టెంబర్21 – Super 4 మ్యాచ్ 1, 2
() సెప్టెంబర్23 – Super 4 మ్యాచ్ 3, 4
() సెప్టెంబర్25 – Super 4 మ్యాచ్ 5
() సెప్టెంబర్26 – Super 4 మ్యాచ్ 6
() సెప్టెంబర్28 – ఫైనల్