సరైన సమయంలోనే తాను టీమిండియా కెప్టెన్సీ పదవికి గుడ్ బై చెప్పానని చెప్పాడు ఎంఎస్ ధోని.రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రమంలో సీఎఎస్‌ఎఫ్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ధోని..తాను కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి గల కారణాలను వివరించారు.
2019 ప్రపచకప్ సమయానికి తన స్ధానంలో కొత్త కెప్టెన్ రావాలన్న ఆకాంక్షతోను తప్పుకున్నట్లు వెల్లడించారు. కొత్త కెప్టెన్‌కు సమయం ఇవ్వకుండా జట్టును ఎంపికచేసుకోమనడం సాధ్యం కాదు. అందుకే సరైన సమయంలోనే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్నా అని వెల్లడించారు.
ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఆ స్ధానాన్ని పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ భర్తీ చేశాడు. కెప్టెన్‌గా,ఆటగాడిగా ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్న ధోని టీమిండియాకు చిరస్మరణీయ విజయాలు అందించాడు. టీ20 వరల్డ్‌కప్,వన్డే ప్రపంచకప్‌ను భారత్‌కు అందించాడు. 2014లో టెస్టు కెప్టెన్‌గా తప్పుకున్న ధోని,2017లో వన్డే,టీ20 ఫార్మట్‌ల సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.