పెట్రో మంట..కొంపముంచిన బీజేపీ ట్వీట్

272
petrol price hike
- Advertisement -

రోజురోజుకి పెరిగిపోతున్న పెట్రోధరలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్‌తో పాటు ప్రధానపార్టీలు సోమవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించిన బీజేపీ బొక్కబొర్లాపడింది.

బీజేపీ ట్వీట్టర్‌లో చేసిన ట్వీట్‌తో నెటిజన్ల చేతిలో నవ్వుల పాలైంది. 80 కంటే 70 ఎక్కువన్న బీజేపీ శాతాల్లో పెట్రోలు పెంపు.. ఇదీ వాస్తవం అంటూ ఓ ఫొటో పోస్టు చేసి అభాసుపాలైంది. భారీగా పెరిగిన పెట్రోలు ధర సూచీని తగ్గించి.. తక్కువ ఉన్న ధరల సూచీని ఎక్కువ చేసి చూపించి నవ్వులపాలైంది.

ఢిల్లీలో మే 2014లో లీటరు పెట్రోలు ధరను రూ. 71.41 అని కానీ ఇప్పుడు మాత్రం రూ.80.73గా ఉన్నట్టు చూపించింది. రూ.80తో పోలిస్తే రూ.70 చాలా ఎక్కువని అర్థం వచ్చేలా రూ. 71.41 సూచీని బాగా పెంచేసి, రూ.80.73 సంకేతాన్ని బాగా తగ్గించి చూపించింది. ఈ పోస్టును చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అంకెలు రాని వాళ్లు దేశాన్ని పాలిస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు.

- Advertisement -