వినాయక చవితి సందర్భంగా బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులను సందడి చేసేందుకు నాలుగు సినిమాలు వస్తున్నాయి. నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన శైలజ రెడ్డి గారి అల్లడు ఒక సినిమా కాగా అర్జున్ హీరోగా మరోసినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
నాగచైతన్య -అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న మారుతి దర్శకత్వంలో శైలజారెడ్డి గారి అల్లుడు సినిమా తెరకెక్కగా రమ్యకృష్ణ కీలకమైన పాత్రను పోషించారు. వినాయక చవితి కానుకగా 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇదే రోజు సమంత నటించిన యూ టర్న్ కూడా రాబోతుంది. యాక్షన్ కింగ్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు అర్జున్. వెండితెరపై మార్షల్ ఆర్ట్స్ కు మంచి గుర్తింపు తెచ్చిన అర్జున్.. ఇమేజ్‌నే ఇంటిపేరుగా మార్చుకుని యాక్షన్ కింగ్‌గా మారాడు. యాక్షన్ హీరోగా దక్షిణాది ప్రేక్షకులందరికీ సుపరిచుతుడైన అర్జున్.. ఇప్పుడు తన కెరీర్‌లో అత్యంత అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఆ తరం హీరోలంతా రిటైర్ అవుతోన్న వేళ తను ఏకంగా హీరోగా 150వ సినిమా చేశాడు. అదే కురుక్షేత్రం. అర్జున్ ఇమేజ్‌కు అనుగుణంగా అత్యంత స్టైలిస్డ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను ఈ వినాయక చవితి సందర్భంగా విడుదల చేయబోతున్నారు.
మహేశ్వర క్రియేషన్స్ పతాకంపై నందు,నోయల్, పునర్నవి భూపాలం హీరో హీరోయిన్లుగా కోటి వద్దినేని దర్శకత్వంలో మాలతి వద్దినేని నిర్మిస్తోన్న చిత్రం ‘ఎందుకో ఏమో’. ఇటీవల ఈ చిత్రం టీజర్, సాంగ్స్ విడుదలై సినిమా పై మంచి క్రేజ్ ని ఏర్పరిచాయి. అన్ని కార్యాక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 12న వినాయక చవితి కానుకగా విడుదలవుతోంది.
సమ్మోహనంతో తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహనం చేసిన సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే.. ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్‌గా ఉండడం… హీరో, హీరోయిన్ పెర్ ఫార్మెన్స్ ఫ్రెష్ గా అనిపించడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఆఫీస్ మొత్తం భయపడే సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజర్ గా సుధీర్‌బాబు నటించగా.. అల్లరి చేసే గడుసమ్మాయి సిరి పాత్రలో హీరోయిన్ నభా నటేశ్ కనిపించనుంది.