సెప్టెంబర్ 13 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నా.. ఆరోజు పెద్ద పండగచేసుకుందాం అన్నారు అక్కినేని నాగచైతన్య. చైతూ,అను ఇమ్మానుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శైలజా రెడ్డి అల్లుడు. ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని,కింగ్ నాగార్జున,అఖిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన చైతూ నా పై అభిమానులు చూపిస్తున్న ప్రేమకి ధన్యవాదాలు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా నాపై చేస్తున్న ప్రతి కామెంట్‌ని చూసి వాటికి అనుగుణంగానే సినిమాలు ఎంపిక చేసుకుంటున్నానని తెలిపారు.
అక్కినేని ఫ్యాన్స్ అంతా నా ఫ్యామిలీ అని ప్రతి సినిమా ఈవెంట్‌కి వచ్చి ఎనర్జీ ఇస్తారని తెలిపారు. మీరే నా బలం,బలహీనత అని తెలిపారు. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందని,మారుతి మంచి కథని అందించారని తెలిపారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ నటించడం పెద్దప్లస్ పాయింట్ అని ఈ క్యారెక్టర్ ఆమె చేసి ఉండకపోతే ఇంత హైప్ వచ్చేది కాదన్నారు. ప్రేమమ్ తర్వాత సుందర్ మంచి సంగీతాన్ని అందించారని చెప్పారు.