అతిలోక సుందరికి అరుదైన గౌర‌వం..

260
- Advertisement -

రోజుకో కొత్త హీరోయిన్ ఇండ‌స్ట్రీకి వ‌స్తున్న ఈ రోజుల్లో ఇంకా చ‌నిపోయిన వాళ్ల‌ను కూడా గుర్తు పెట్టుకోవ‌డం అనేది చిన్న విష‌యం కాదు. అలా జ‌ర‌గాలంటే వాళ్లు చ‌రిత్ర సృష్టించాలి. ఇప్పుడు శ్రీ‌దేవి కూడా ఇదే జాబితాలోకి వ‌స్తుంది. ఈమె క‌న్నుమూసిన త‌ర్వాత కూడా అభిమానుల మ‌దిలో మాత్రం ఎప్ప‌టికీ బ‌తికే ఉంటుంది. ఇండియాలో ఎవర్ గ్రీన్ హీరోయిన్ ఎవరంటే ఠక్కున గుర్తు వచ్చే పేరు శ్రీదేవి. తెలుగు, తమిళ, హిందీ సహా పలు భాషల్లో వందలాది సినిమాల్లో నటించిన శ్రీదేవికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

actress Sridevi

తాజాగా శ్రీదేవికి అరుదైన గౌరవం దక్కనుంది. తమ దేశంలో శ్రీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్విట్జర్లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. తమ దేశంలో తెరకెక్కిన పలు చిత్రాల్లో శ్రీదేవి నటించారని స్విట్జర్లాండ్ అధికారులు తెలిపారు. శ్రీదేవి నటించిన పలు సినిమాల షూటింగులు తమ దేశంలో జరిగాయని, తద్వారా స్విట్జర్లాండ్ పర్యాటకం అభివృద్ధి చెందేందుకు కారకులయ్యారని వ్యాఖ్యానించారు.

శ్రీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు. చాలా సినిమాలను స్విట్జర్లాండ్ కేంద్రంగా తెరకెక్కించిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు యశ్ చోప్రా విగ్రహాన్ని స్విస్ ప్రభుత్వం 2016లో అక్కడ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శ్రీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

- Advertisement -