కొండా దంపతులపై మండిపడ్డారు వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు వినయ్ భాస్కర్,గుండు సుధారాణి,మర్రి యాదవరెడ్డి. కొండా దంపతులు గుండా దంపతులని…వారికి రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ అనిగుర్తు చేసింది గుండు సుధారాణి.కొండా సురేఖ బ్రతిమిలాడితేనే ఆమెకు వరంగల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని గుర్తుచేశారు.టీఆర్ఎస్ పార్టీలో గ్రూపులు లేవని…పార్టీ గురించి మాట్లాడే నైతికహక్కు వారికి లేదని స్పష్టం చేసింది.
కేసీఆర్,కేటీఆర్లపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఉద్దేశంతో ఆమె టీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కొండా సురేఖ, మురళి దంపతులు స్వయంగా నా దగ్గరకు వచ్చి టీఆర్ఎస్ రాజకీయ జీవితం ఇవ్వాలని అడిగారు అని వినయ్ గుర్తు చేశారు. కేసీఆర్ పెద్ద మనసుతో కొండా దంపతులకు రాజకీయ జీవితం ప్రసాదించారన్నారు. కొండా మురళి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కూడా భూములను వేలం పెడితే తనను కొండా మురళి బెదిరించారని టీఆర్ఎస్ నేత మర్రి యాదవరెడ్డి తెలిపారు. టీఆర్ఎస్లో ఉంటూ కొండా దంపతులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని సర్వేల ఆధారంగానే కేసీఆర్ టికెట్లను కేటాయించారని చెప్పారు.