కలర్స్ స్వాతి షాకిచ్చింది..

262
colours swathi
- Advertisement -

కలర్స్ ప్రోగ్రాం ద్వారా బాగా పాపులర్ అయిన స్వాతి సినిమా హీరోయిన్ గా డీసెంట్ పేరు తెచ్చుకుంది. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పదేళ్ల క్రితం ఓ తమిళ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన స్వాతి ఆ తరువాత డేంజర్, అష్టాచమ్మా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, గోల్కొండ హైస్కూల్‌, క‌ల‌వ‌ర‌మాయె మ‌దిలో, స్వామి రారా, కార్తికేయ‌ తదితర తెలుగు చిత్రాల్లో నటించింది. అయితే ఇన్ని రోజులు పెళ్లి గురించి మాటెత్తని స్వాతి సడన్ గా హడావిడి లేకుండా పెళ్లి చేసుకోవడం అందరిని స్వీట్ షాక్ కి గురి చేసింది. దానికి కారణం లేకపోలేదు.

colours swathi

ఇంతకు స్వాతి పెళ్లి ఎవరితో జరిగిందని ఆలోచిస్తున్నారా… స్వాతి భర్త ఎయిర్‌ లైన్స్‌ పైలెట్‌.. ఆయన వికాస్‌. వీరిద్దరు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లి ఇరువురి కుటుంబ పెద్దల సమక్షంలో సాంప్రదాయ పద్దతిలో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే తన పెళ్లికి స్వాతి సినిమా వాళ్లని ఎవరిని ఆహ్వానించలేదు. కేవలం తన చిన్ననాటి మిత్రులు.. బంధువుల సమక్షంలోనే జరుపుకుంది. అయితే స్వాతి పెళ్లి ఫోటోలు ఇప్పుడు నెట్‌ లో వైరల్‌ గా మారాయి.

colors-swathi-wedding

అయితే తన పెళ్లిని సింపుల్‌ గా ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా జరుపుకున్న స్వాతి రిసెప్షన్‌ ను మాత్రం ఘనంగా చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రిసెప్షన్‌ వేడుకకు సినిమా వారిని ఆహ్వానించనున్నట్లు సమాచారం.

- Advertisement -