- Advertisement -
షాద్‌నగర్‌లో ఇవాళ మంత్రి కేటీఆర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా మండల పరిషత్ కార్యాలయంలో ఆడిటోరియం నిర్మాణానికి, షాద్‌నగర్ మున్సిపాలిటీ భవన నిర్మాణానికి, 1700 డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఇతర రాష్ర్టాల నాయకులు.. తెలంగాణ అభివృద్ధిని చూసి కొనియాడుతున్నారు.
ఆంధ్రాకు చెందిన కొందరు ప్రజలు.. తమకు సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. టీఆర్‌ఎస్ పార్టీని కూడా ఆంధ్రాలో పెట్టండని అక్కడి ప్రజలు పిలుస్తున్నారు. కేసీఆర్ పాలనకు ఎంత జన ఆమోదం ఉందో దీన్ని బట్టి తెలుస్తుందన్నారు. అని కేటీఆర్ అన్నారు. షాద్‌నగర్‌కు గొప్ప చరిత్ర ఉందన్నారు. ఇంకా 1952-56 వరకు హైదరాబాద్ రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఈ షాద్‌నగర్ వ్యక్తే అని గుర్తు చేశారు.
- Advertisement -