అభిమానిపై ఆగ్రహించిన త్రిష..

258
- Advertisement -

దశాబ్ధం పాటు స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందిన త్రిష ప్రస్తుతం కెరీర్ పరంగా ఒడిదుడుకులును ఎదుర్కొంటుంది. ఇక అసలు విషయం ఏంటంటే..సామాజిక మాధ్యమాల్లో అభిమానుల మధ్య వార్ గురించి తెలిసిందే. తమ అభిమాన తార మెప్పు కోసం వేరే స్టార్లను కించపరిచేలా – బూతు పదాలతో కామెంట్లు చేయడం ఇటీవల ఎక్కువైంది. ఒక్క త్రిష విషయంలోనే కాదు. ఎందరో స్టార్ల విషయంలో అభిమానులు ఇలా చేయడం చర్చకొచ్చింది. వీరాభిమానం వెర్రితలలు వేస్తోంది. పిచ్చి పీక్స్ కి చేరుతోంది. అందుకే తన అభిమానికి ఇలా త్రిష తనదైన స్టైల్లో వార్నింగ్‌ ఇచ్చింది.

Actress Trisha

సహ నటుల గురించి అసభ్యకరంగా మాట్లాడిన ఓ అభిమాని పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కథానాయిక త్రిష. ఓ నెటిజన్‌ త్రిషకు ట్వీట్‌ చేస్తూ ఇతర నటీనటుల గురించి అసభ్యకరంగా మాట్లాడాడు. అయితే త్రిష ఆ నెటిజన్‌ వివరాలు చెప్పకుండా అతన్ని బ్లాక్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. ‘నా టైంలైన్‌లో ఇంత అసభ్యకరంగా మాట్లాడటమా.. నా పట్ల నీకున్న అభిమానం నిజాయతీగలదని నిరూపించుకోవడానికి ఇతర నటీనటుల గురించి అమర్యాదకరంగా మాట్లాడతావా? లేదంటే నన్ను ఈరకంగా వేధించాలని చూస్తున్నావా? నిన్ను బ్లాక్‌ చేయబోతున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు త్రిష.

త్రిష ప్రస్తుతం కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ జోడీగా నటిస్తున్నారు. త్రిష, రజనీ కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రమిది. ఇందులో ప్రముఖ నటి సిమ్రన్‌ మరో కథానాయికగా నటిస్తున్నారు. మరోపక్క త్రిష.. విజయ్‌ సేతుపతికి జోడీగా ‘96’ అనే చిత్రంతోనూ బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సి.ప్రేమ్ కుమార్ దర్శకుడు.

https://twitter.com/trishtrashers/status/1036648984708698114

- Advertisement -