టీఆర్ఎస్ పార్టీ రేపు ప్రగతి నివేదన సభ నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సభపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానమిచ్చారు.
రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో నిన్న(శుక్రవారం) ప్రగతి నివేదన బహిరంగ సభ వేదిక వద్ద మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలతో కలసి ఆయన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. టీఆర్ఎస్ నిర్వహించనున్న భారీ బహిరంగ సభను చూసి ప్రతి పక్షాలు భయపడుతున్నాయని, అందుకే అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. అంతేకాకుండా…ప్రగతి నివేదన బహిరంగసభ కోసం ఒక్క అధికారినీ వినియోగించుకోలేదని, సభ ఖర్చును మొత్తం పార్టీనే భరి స్తోందని స్పష్టం చేశారు.
కాగా…ఈ సభకు, ఎన్నికలకు ఎలాంటి సంబంధమూ లేదని తెలిపారు. అంతేకాకుండా.. డబ్బులు పంపిణీ చేసే అలవాటు కాంగ్రెస్‌కే ఉందని ఎద్దేవా చేసిన ఆయన, రేవంత్ రెడ్డి నోట్ల కట్టలతో దొరికి జైలుకూడు తిన్నాడని గుర్తుచేశారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే తమకంటే పెద్ద సభ నిర్వహించాలని సవాల్ విసిరారు నాయిని.