- Advertisement -
సెరీనా నాలుగవ రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. యూఎస్ ఓపెన్ రౌండ్ మ్యాచ్ లో తన సోదరి వీనస్ విలియమ్స్ ను ఓడించి, 6-1, 6-2 స్కోర్ తేడాతో నాలుగవ రౌండ్లోకి ప్రవేశించింది.
ఇవాళ జరిగిన మ్యాచ్‌లో కేవలం 71 నిమిషాల్లోనే మ్యాచ్‌ని ముగించేసింది సెరీనా. ఫస్ట్ సెట్ లో మెడికల్ టైమౌట్ తీసుకున్న సెరీనా…చాలా ఈజీగా ఆ సెట్‌ను కైవసం చేసుకుంది. మొదటి రౌండ్లో వరల్డ్ నెంబర్ వన్ సైమోనా హలెప్‌ను ఓడించిన ఇస్టోనియాకు చెందిన కయా కనేపితో తర్వాత రౌండ్లో సెరీనా తలపడుతుంది.
ఇదిలాఉంటే..గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అక్కాచెల్లెలు పోటీపడడం ఇది 30వ సారి. ఇక 23 సార్లు గ్రాండ్ స్లామ్ చాంపియన్ అయిన సెరీనా.. 24 గ్రాండ్‌స్లామ్‌లు చేజిక్కించుకున్న మార్గరెట్ కోర్ట్ ఆల్ టైమ్ రికార్డును అందుకోవాలని చూస్తోంది.
- Advertisement -