నయనతారకు పంచ్‌లిచ్చిన వీరాభిమాని‌…!

273
nayanatara
- Advertisement -

దక్షిణాదిలో అగ్ర హీరోయిన్‌ హొదాను ఎంజాయ్ చేస్తున్న నయనతార.. తాను నటించిన సినిమాలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గోనదన్న సంగతి తెలిసిందే. కోపం ఎక్కువగా ఉండే నయన్‌.. కొన్ని సార్లు ఆడియో ఫంక్షన్లకు కూడా డుమ్మాలు కొట్టిన సంధర్బాలున్నాయి. అయితే ఏ నిర్మాత కూడా నయన్‌ దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకురారట. ఎందుకంటే నయన్‌తో చేసే అగ్రిమెంట్లో.. నయనతార ఎలాంటి ప్రమోషన్లకు రాదన్న క్లాజ్‌ ఒకటి ఉంటుందట. అందుకే నిర్మాతలు కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. అయితే ఈ విషయాన్ని మాత్రం ఓ సీనియర్ తమిళ కామెడియన్ సీరియస్‌గా తీసుకున్నాడు. నయన్‌ను నేరుగా అనకుండా పరోక్ష ధోరణిలో విమర్శించాడు.

Vivek2

ఇంతకీ ఆ కామెడియన్ ఎవరంటే.. వివేక్.. తెలుగులోకి వచ్చే తమిళ సినిమాలను చూసే వాళ్లకు ఆయన సుపరిచయమే. ఇంతకీ ఆయనేమన్నాడంటే… ”కొందరు హీరోయిన్లు ప్రమోషన్స్‌లో పాల్గొనడం మానేస్తుంటారు. ఇందుకు వారు చెప్పే సమాధానం కూడా చాలా తెలివిగా హుందాగా ఉంటుంది.

తాను సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటే సినిమా ప్లాప్ అవుతుందని సెంటిమెంట్ అంటూ డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతూ.. నిర్మాతలను భయపెడుతూ ఉంటారు. ఇదే మాదిరిగా వీళ్లు పూర్తిగా రెమ్యూనరేషన్ తీసుకున్నా సరే సినిమా ఫెయిల్ అవుతుందనే సెంటిమెంట్ ఉంటే బాగుంటుందేమో” అన్నాడు వివేక్. కార్తీ హీరోగా.. శ్రీ దివ్య, నయనతార హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కాష్మోరా’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న తమిళ కమెడియన్ వివేక్.. కొందరు హీరోయిన్స్ అంటూ జనరలైజ్ చేసి నయనతారకు పంచ్‌లిచ్చాడు.

Rathna-Maha-Devi-First-Look-from-Kaashmora

ఈ కామెంట్స్ చేసినపుడు.. నయనతార పేరును చెప్పలేదుకానీ… ఇది కేవలం నయనతార మాత్రమే వర్తిస్తుందని అందరికీ తెలిసిందే. ఇలా మీడియాలో నయనతారకు పంచ్ వేశాడు అనే రచ్చ ఎక్కువైపోవడంతో.. ”నేను నయన్‌కు పెద్ద వీరాభిమానిని… నేను చెప్పింది నయన్‌ను ఉద్దేశించి కాదు” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు వివేక్. ఈ హీరో ఎన్ని క్లారిటీలు ఇచ్చినా.. అక్కడ పంచ్ పడింది నయనకేనని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా,పి.వి.పి.సినిమా, డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్స్‌పై గోకుల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాష్మోరా’.. అక్టోబర్‌ 28న విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

- Advertisement -