- Advertisement -
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు మరోసారి ఫైనల్‌ను అధిగమించలేకపోయింది. దీంతో ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా క్రీడల్లో సింధు రజతంతోనే సరిపెట్టుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్లో సింధు ప్రపంచ నంబర్‌వన్ క్రీడాకారిణి తై జు యింగ్(చైనీస్ తైపీ) చేతిలో రెండు వరుస గేమ్‌ల్లో ఓడి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది.
అయితే తై జు యింగ్ చేతిలో 13-21, 16-21 తేడాతో ఓడినా సింధు చరిత్ర సృష్టించింది. ఏషియన్ గేమ్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు నిలిచింది. ఇంతకుముందు సైనా నెహ్వాల్ సెమీస్‌లోనే ఓడి బ్రాంజ్ మెడల్‌తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫైనల్ ఫోబియా కొనసాగిన వేళ.. మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సింధు ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.
- Advertisement -