‘పేప‌ర్ బాయ్’కి ప్ర‌భాస్ ఫిదా..

301
Prabhas
- Advertisement -

పేప‌ర్ బాయ్ చిత్ర ట్రైల‌ర్ కు త‌న ప్ర‌శంస‌లు అంద‌చేసాడు యంగ్ రెబ‌ల్ స్టార్.. బాహుబ‌లి ప్ర‌భాస్. ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత కాసేపు చిత్ర‌యూనిట్ తో ముచ్చ‌టించారు.  ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ మాట్లాడుతూ.. ట్రైల‌ర్ మ‌రియు పాట‌లు లో మంచి విజువ‌ల్స్ క‌నిపిస్తున్నాయి. శోభ‌న్ గారు నా కెరీర్ కు వ‌ర్షం సినిమాతో తొలి విజ‌యాన్ని అందించారు.

Prabhas

అదే విధంగా ఇప్పుడు సంతోష్ కూడా విజ‌యం అందుకోవాల‌ని కోరుకుంటున్నాను. నా బిల్లా సినిమాకు ప‌ని చేసిన సౌంద‌ర్ రాజ‌న్ ఫోటోగ్ర‌ఫీ అద్బుతంగా ఉంది. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ ఈ చిత్ర హ‌క్కుల్ని కొన‌డం మ‌రో మంచి ప‌రిణామం. సంప‌త్ నంది గారికి అంతా మంచి జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాను. అలాగే ఇతర నిర్మాత‌ల‌కు కూడా నా విషెస్ తెలియ‌జేస్తున్నాను అని తెలిపారు.
ప్ర‌భాస్ వ‌చ్చి త‌మ చిత్రానికి విషెస్ తెల‌ప‌డంతో పేప‌ర్ బాయ్ చిత్ర‌యూనిట్ ఆనందంలో తేలిపోతున్నారు. ఆగ‌స్ట్ 31న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

Prabhas

..

- Advertisement -