ఇక్కడ ఏమైనా జరగొచ్చు అంటూ నాని యాంకరింగ్ లో స్టార్ట్ ఐన బిగ్ బాస్ షో, రోజు రోజు కు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారుతూ, చివరికి మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు నమోదయ్యే రేంజ్ కి ఎదిగింది. బిగ్ బాస్ షో మానవ హక్కులను ఉల్లఘించేలా మారిందని, సామజిక మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని హైకోర్టు న్యాయవాది ఐన రాపోలు భాస్కర్, హైదరాబాద్ హెచ్.ఆర్.సి లో ఫిర్యాదు నమోధు చేసారు.
16 మందిని ఓ ఇంట్లో నిర్బంధించి వాళ్ళతో ఆదుకోవడం అనేది చట్టరీత్య నేరమని, అందులో ఆడవాళ్లపై వెకిలి చేష్టలు చేయడం, ఒకరినొకరు తిట్టుకోవడం ఇవన్నీ చూసే జనాల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని భాస్కర్ ఆగ్రహించారు. వినోదం కోసం వాళ్ళ చేత బాత్రూం లు కడిగించడం, ఆటల పేరుతో ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడం వంటివి సమాజాన్ని పక్కదోవ పట్టించేవిధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటివి చూసే వెంటనే బిగ్ బాస్ కార్యక్రమాన్ని నిలిపి వేయాలని, అందుకు కోర్ట్ నుంచి స్టే ఆర్డర్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మధ్య మరింత మసాలా యాడ్ ఐన మన బిగ్ బాస్ షో పై మానవహక్కుల కమిషన్ ఎలాంటి చర్యలను తీసుకుంటుందోనని సామజిక మాధ్యమాల్లో విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి.