వాట్సాప్‌ వీడియో కాలింగ్ వచ్చేసింది..

244
Online News Portal
WhatsApp video calling goes live
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌ వాట్సప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. అయితే ఇతర యాప్‌లతో పోలిస్తే ఫీచర్లు కొంత తక్కువే అయినా, ఉన్నంతలో క్వాలిటీ ఫీచర్స్‌ను అందించే ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌గా వాట్సప్ పేరుగాంచింది. ఈ క్రమంలో గతేడాది ఈ యాప్‌లో వాయిస్ కాలింగ్ ఫీచర్ అందుబాటులోకి రాగా, దాన్ని అధిక సంఖ్యలో యూజర్లు ఇప్పటికీ వాడుతున్నారు. ఇదే పంథాలో వాట్సప్ వీడియో కాలింగ్ ఫీచర్‌ను కూడా యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.

whatsapp-video-calling-feature-download-free-apk2

వాట్సాప్‌ అందుబాటులోకి తెచ్చిన వీడియో కాలింగ్ ఫీచర్ ప్రస్తుతం ఆ యాప్‌కు చెందిన బీటా వెర్షన్‌లోనే లభ్యమవుతోంది. అది కూడా కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లను వాడుతున్న యూజర్లకు మాత్రమే ఈ అప్‌డేట్ లభిస్తోంది. ప్రస్తుతం యూజర్లందరూ 2.16.317 వాట్సప్ వెర్షన్‌ను వాడుతుండగా, 2.16.318 బీటా వెర్షన్ థర్డ్ పార్టీ సైట్‌లో యూజర్లకు లభ్యమవుతుంది. దీన్ని HTTP://WWW.APKMIRROR.COM/ అనే సైట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందులోనే వాట్సప్ కొత్త బీటా వెర్షన్ అందుబాటులో ఉంది. అయితే ఇప్పటికి ఈ వెర్షన్ టెస్టింగ్ దశలో ఉన్న నేపథ్యంలో త్వరలో పూర్తి స్థాయి వెర్షన్ అందుబాటులోకి రానుంది. అప్పుడు ప్లే స్టోర్ ద్వారా యూజర్లందరికీ ఈ యాప్ అప్‌డేటెడ్ వెర్షన్ లభించనుంది.

whatsapp-video-call

ఇంతకు ముందు అనేక మెసెంజర్ యాప్‌లలో వీడియో కాలింగ్ ఫీచర్ అందుబాటులో ఉంది. కానీ ఆ ఫీచర్ అంత స్పష్టమైన వీడియో క్వాలిటీని కలిగి లేదు. ఈ క్రమంలో వాట్సప్ బీటా వెర్షన్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వీడియో కాలింగ్ ఫీచర్‌లో చేసుకునే కాల్స్‌లో వీడియోలు చాలా స్పష్టంగా ఉంటున్నాయని పలువురు యూజర్లు నెట్‌లో తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. అయితే బీటా వెర్షన్‌లోనే వీడియో కాల్ క్వాలిటీ అదుర్స్ అనిపిపించే విధంగా ఉండడంతో ఇక పూర్తి స్థాయి వెర్షన్‌లో దాని క్వాలిటీ మరింత పెరగవచ్చు.

- Advertisement -