దుమ్మురేపుతున్న శైలజారెడ్డి అల్లుడి సాంగ్స్

245
Sailaja-Reddy-Alludu
- Advertisement -

మారుతి దర్శకత్వంలో నాగచైతన్య, అను ఎమ్మాన్యుయేల్‌ ప్రధాన పాత్రలలో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం శైలజా రెడ్డి అల్లుడు. ఈ సినిమాలో సీనియర్‌ నటి రమ్యకృష్ణ అత్త పాత్రలో నటిస్తోంది. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తుందనే టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ టీజర్‌కు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ మూవీని ఆగస్టు 31వ తేదీన రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్‌.

Sailaja-Reddy-Alludu

ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన సాంగ్స్‌ ప్రేక్షకుల్లో మూవీపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. అందుకు తగ్గట్టే మూవీ ప్రమోషన్స్‌ కూడా చేస్తోంది శైలజారెడ్డి మూవీ టీం. ఈ మూవీలో సింగర్‌ మంగ్లీ పాడిన పాట యూట్యూబ్‌లో వైరల్‌ గా మారింది. శైలజా రెడ్డి అల్లుడు జూడే అనే పాట య్యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. తెలంగాణ యాసలో ఉన్న ఈ పాటకు ఇప్పటికే ఎంతో మంది ప్యాన్స్‌ అయ్యారు. చాలా మంది సాంగ్‌ సూపర్‌ ఉందంటూ ట్విట్టర్‌లో కామెంట్స్ చేస్తున్నారు.

Sailaja-Reddy-Alludu

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో సాంగ్‌ను రిలీజ్‌ చేసింది శైలజారెడ్డి అల్లుడు మూవీ టీం. ఎగిరెగెరే అనే సాంగ్ చూస్తుంటే బాగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ఇందులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు సినిమాటోగ్రఫీ చాలా అందంగా ఉంది. ఈ చిత్రానికి గోపిసుంద‌ర్ చిత్రానికి స్వ‌రాలు స‌మకూర్చారు. ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ నాగచైతన్యకు ఏమేరకు హిట్‌నిస్తుందో చూడాలి.

- Advertisement -