మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఉయ్యాల వాడ నరసింహారెడ్డి సినిమా టీజర్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ వార్త తెలియగానే మెగా అభిమానుల్లో సందడి నెలకొంది. తమ అభిమాన హీరో చిరంజీవి నటించిన సైరా మూవీ టీజర్ ఎప్పుడెప్పుడూ వస్తుందా ఆశతో ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు.
స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను దాదాపు రూ.300 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమా రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించించింది సైరా టీమ్. చిరంజీవి బర్త్ డే ఆగస్టు 22వ తేదీన జరుగనుండగా అంతకన్నా ఒక రోజు ముందు అంటే ఆగస్టు 21వ తేదీన సైరా మూవీ టీజర్ లాంచ్ చేసి 22వ తేదీన చిరంజీవి బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది సైరా టీమ్.
ఇప్పటికే సైరా మూవీ ఘనవిజయం సాధించాలని మెగా అభిమానులు పూజలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చిరంజీవి నటించిన సైరా మూవీ టీజర్ మెగా అభిమానుల్లో ఆసక్తితో పాటు సినీ పరిశ్రమలో హీట్ పెంచుతోంది.