ఫోన్లో కబుర్లేంటి..? భార్య చెవికోసిన భర్త..

269
He cuts off wife's ears
- Advertisement -

ఒక సెల్‌ ఫోన్‌..తన భార్య చెవి కోయడానికి కారణమైంది. అవును.. తాను ఎన్నిసార్లు చెప్పినా వినకుండా భార్య ఫోన్లో మాట్లాడుతుండటాన్నితట్టుకోలేకపోయాడు ఓ భర్త. అంతే ఆగ్రహంతో ఆమె చెవిని కోసేశాడు. తమిళనాడులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ ఘటన గురించి తెలుసుకున్నవారంతా.. సెల్‌ ఫోన్‌ జీవితంలో ఒక భాగమే కాదు..ఇప్పుడు కుటుంబాలను చిన్నాభిన్నం చెయ్యడంలోనూ ముందే ఉన్నట్టుంది అంటున్నారు.

అసలు విషయానికోస్తే..సేలంలో ముత్తురాజా(40), ఆయన భార్య సంధ్య(40) ఎడప్పాటి పెరుమాళ్గుడి ప్రాంతంలో ఉంటున్నారు. భార్య సంధ్య ప్రైవేటు స్కూల్ లో అసిస్టెంట్‌ హెడ్మాస్టర్‌ గా పనిచేస్తుండగా, భర్త ముత్తురాజా ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తోన్నాడు. అయితే ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడుకుంటూ..సంధ్య భర్తని పట్టించుకునేది కాదు. భార్య ప్రవర్తన నచ్చక పద్దతి మార్చుకోవాలంటూ.. ఆమెను ముత్తురాజా పలుమార్లు హెచ్చరించాడు. అయినా ఆమె తీరు మారలేదు.

ఈ నేపథ్యలోనే గురువారం రాత్రి పనినుంచి ఇంటికొచ్చిన ముత్తురాజాను పట్టించుకోకుండా ఫోన్‌ సంభాషణల్లో మునిగిపోయింది సంధ్య. తాను వచ్చినా పట్టించుకోకపోవడమేకాకుండా..ఫోన్‌ లో నవ్వుతూ మాట్లాడడంతో తీవ్ర కోపానికి లోనైన ముత్తురాజా కత్తిపీటతో సంధ్య కుడిచెవిని కోసి పారేశాడు. ఇక భాదితురాలు గట్టిగా అరవడంతో చుట్టుపక్కలవారు అక్కిడి చేరుకొని ఆమెని ఆస్పత్రికి తరలించారు. కాగా..భార్య ఇచ్చిన ఫిర్యాదుతో ముత్తురాజాను పోలీసులు అరెస్ట్ చేశారు.

- Advertisement -