- Advertisement -
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఇకలేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిస్వాస విడిచారు. ఆయన మరణాన్ని ఎయిమ్స్ వైద్యులు అధికారికంగా ప్రకటించారు. అనారోగ్య కారణంగా 2009 నుంచి వాజ్ పేయి ఇంటికే పరిమితమయ్యారు .
కాగా.. మూత్రనాళ ఇన్ఫెక్షన్ కారణంగా జూన్ నెలలో ఎయిమ్స్ లో చేరిన ఆయన 65 రోజులుగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ చివరకు తుదిశ్వాస విడిచారు. వాజ్‌పేయి మరణవార్తతో యావత్ దేశం దు:ఖసాగరంలో మునిగిపోయింది. వాజ్‌పేయి వయసు 93 సంవత్సరాలు. వాజ్‌పేయి మరణంతో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. మరోవైపు వాజ్‌పేయి నివాసం వద్దకు కూడా ప్రధాని మోదీ, బీజేపీ నేతలు చేరుకున్నారు.
- Advertisement -