నగరంలో బ్రెస్ట్ క్యాన్సర్ పై పింక్ వాక్ పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కేబీఆర్ పార్క్ నుంచి బసవతరాకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వరకు ఈ వాక్ నడిచింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ కవిత ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు.
కేన్సర్‌ను మొదటిలోనే గుర్తిస్తే ప్రమాదం నుంచి బయటపడొచ్చన్నారు.చాలామంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన లేక ఆరోగ్యపరంగా నష్టపోతున్నారని కవిత తెలిపింది.సరైన అవగాహన కల్పించేందుకు సెలబ్రిటీలు ముందుకు రావాలన్నారు.
ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. రొమ్ము క్యాన్సర్ వల్ల చాలామంది మహిళలు చనిపోతున్నారని ఆయన అన్నారు.బసవతారకం కేన్సర్ ఆస్పత్రి ద్వారా పేద ప్రజలకు సేవలందించామన్నారు. భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నటి మంచు లక్ష్మితో పాటు పలువురు హాజరయ్యారు.