అరుదైన గౌరవం అందుకున్న ‘గూఢచారి’

205
Goodachari Movie
- Advertisement -

నటుడు అడవి శేషు నటించిన తాజా చిత్రం ‘గూఢచారి’. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ చిత్రంలో శోభిత ధూలిపాళ్ల హీరోయిన్. ప్రకాష్‌ రాజ్ కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా ద్వారా శశికిరణ్ తిక్కా దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ శుక్రవారం విడుదలైన గూఢచారి చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళు చేస్తుంది. ఈ మూవీకి ఒ అరుదైన గౌరవం దక్కించుకుంది.

Goodachari Movie

స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈమూవీకి ప్రముఖ ఇంటర్నెట్ డేటా బేస్ (ఐఎండిబి) సంస్థ పదికి 9.1 రేటింగ్ ఇచ్చింది. గతంలో అతి కొద్ది సినిమాలకి మాత్రమే ఆ సంస్థ ఇలా రేటింగ్ ఇచ్చింది. అంతేకాదు ఇటీవల విడుదలైన చి.ల.సౌ మూవీకి 9 రేటింగ్ ఇచ్చారు ఐఎండిబి సంస్థ. మంచి ఘనత సాధించిన ఈ సినిమాలు రానున్న రోజులలో బాక్సాఫీస్ దగ్గర మరిన్ని వసూళ్ళు రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది.

ఈ మూవీతో సుప్రియ యార్లగడ్డ వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు. వెన్నెల కిషోర్, అనిష్ కురివెళ్ల, రాకేష్ వర్రీ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు . శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం ప్రేక్షకులను అలరిస్తోంది… శనీల్ డియో సినిమాటోగ్రఫీ అందించారు.

- Advertisement -