కికీ ఛాలెంజ్‌…కఠిన చర్యలు:మహేందర్ రెడ్డి

411
dgp mahender reddy
- Advertisement -

కికీ ఛాలెంజ్‌ పేరుతో సాహసాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు డీజీపీ మహేందర్ రెడ్డి. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన డీజీపీ ఈ ఛాలెంజ్‌తో ఎదుటి వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. చాలామంది యువత వాహనాలు నడుపుతూ రోడ్లపై డ్యాన్స్‌ చేస్తూ,రన్నింగ్ వెహికిల్‌పై నుంచి దూకుతున్నారన్నారు. ఈ ఛాలెంజ్‌ వల్ల ప్రమాదాలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

ఇలాంటి స్టంట్ల జోలికి వెళ్లొద్దని సూచించిన మహేందర్ రెడ్డి… సురక్షితమైన డ్రైవింగ్ మంచిదన్నారు. కికీ ఛాలెంజ్‌ చేస్తున్న వారితో పాటు రోడ్డుపై వెళ్లే వాహనదారులకు ప్రమాదకరమని చెప్పారు.

ఇలాంటి ఘటనలను సీరియస్‌గా తీసుకుంటున్నామని,క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామన్నారు. సురక్షితమైన డ్రైవింగ్ చేస్తూ తమ లక్ష్యాలను నేరవేర్చుకుని సంతోషకరమైన జీవనం సాగించాలన్నారు.

- Advertisement -