ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో భేటీకానున్న మోత్కుప‌ల్లి..

315
mothukupally, pawan kalyan
- Advertisement -

సినీయ‌ర్ నాయ‌కుడు, టిడిపి బ‌హిష్కృత నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో భేటీ కానున్నారు. ఈరోజు మ‌ధ్యాహ్నం 3గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ నివాసంలో మోత్కుప‌ల్లి చ‌ర్చ‌లు జ‌రుప‌నున్నారు. ఇక వీరిద్దిరి భేటీపై తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. మోత్కుప‌ల్లి న‌ర్సింహులు జ‌న‌సేనలో చేర‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఒక‌వేళ ఆయ‌న జ‌న‌సేన పార్టీలో చేరితే ప‌ద‌వి ఇస్తార‌నే చ‌ర్చ కూడా జ‌ర‌గుతుంది.

mothukupally

మోత్కుప‌ల్లి గ‌నుక జ‌న‌సేన‌లో చేరితే తెలంగాణ జ‌న‌సేన అధ్య‌క్షుడి ప‌ద‌వి ఇవ్వ‌నున్నార‌ని వార్తలు వ‌స్తున్నాయి. గ‌త కొద్ది రోజుల క్రితం ఏపీ సీఎం చంద్ర‌బాబుపై మోత్కుప‌ల్లి తీవ్ర స్ధాయిలో విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. పార్టీ జాతీయ అధ్య‌క్షుడిపై ఈవిధంగా వ్యాఖ్య‌లు చేసిందుకు గాను తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు ఎల్. ర‌మ‌ణ ఆయ‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. వైసిపి ఎంపి విజ‌యసాయి రెడ్డి కూడా ఇటివ‌లే మోత్కుప‌ల్లి ఇంటికి వెళ్లి క‌ల‌వడంతో వైసిపిలో చేరుతాడ‌నే వార్త‌లు వ‌చ్చాయి. మోత్కుప‌ల్లి జ‌న‌సేన‌లో చేరుతాడో లేదో ఈవాళ సాయంత్రం తెలియ‌నుంది.

- Advertisement -