కేటీఆర్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన మహేష్‌

368
mahesh green challenge
- Advertisement -

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా కేటీఆర్‌ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ని స్వీకరించారు ప్రిన్స్ మహేష్ బాబు. తన ముద్దుల కూతురు సితారతో కలిసి మొక్కలు నాటిన ఫోటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. హరితహారం గొప్ప కార్యక్రమని తెలిపిన ప్రిన్స్‌ తనను ఈ ఛాలెంజ్‌కి ఆహ్వానించినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

అంతేగాదు తన ముద్దుల కూతురు సితార,కొడుకు గౌతమ్‌,దర్శకుడు వంశీ పైడిపల్లికి గ్రీన్ ఛాలెంజ్‌ని విసిరారు. ప్రస్తుతం మహేష్-వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌ ఉద్యమంలా సాగుతోంది. ఇటీవలె ఎంపీ కవిత విసిరిన ఛాలెంజ్‌కు దర్శకధీరుడు రాజమౌళి సైతం స్పందించిన సంగతి తెలిసిందే. అంతేగాదు కేటీఆర్‌ విసిరిన సవాల్‌కు భార‌త మాజీ క్రికెటర్లు సచిన్ , వీవీఎస్ లక్ష్మణ్ స్పందించి మొక్కలు నాటారు.

- Advertisement -