నేడే ఉజ్జయని మహంకాళి జాతర

274
ujjainimahakali
- Advertisement -

తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు రూపం.. భక్తుల కొంగు బంగారం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబురాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్‌ అమ్మవారి దర్శనం కోసం తెల్లవారు జామునుంచే భక్తులు బారులు తీరారు. అమ్మవారి దర్శనం నిమిత్తం ఆలయ ద్వారాలను ఉదయం 4 గంటలకే తెరిచారు. తెల్లవారుజామునే మహా మంగళ హరతితో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు.

బంగారు కిరీటం, వజ్రాల ముక్కుపుడక,బొట్టుతో అలంకరించారు. కాసుల దండ, మంగళ సూత్రాలతో దివ్యమంగళ స్వరూపంగా అమ్మవారు భక్తుల దర్శనం ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అమ్మవారికి తొలిబోనం సమర్పించారు..ఇక జాతరలో ప్రధాన ఘట్టంగా రంగం వైభవంగా జరగనుంది. ఇందులో అమ్మవారు చెప్పే భవిష్య వాణి కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు.

- Advertisement -