‘నా పేరు సూర్య’ తరువాత మెగా హీరో అల్లు అర్జున్ తన తరువాతి సినిమాపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడట. కథ నచ్చకపోతే నిర్మోహమాటంగా నచ్చలేదని చెప్పేస్తున్నట్లు తెలుస్తోంది. మార్పులు చేసి తీసుకురావాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం ‘నా పేరు సూర్య’ బాక్సీఫీస్ వద్ద నిరుత్సాహ పరుచడమే అని చెప్పుకుంటున్నారు. వరుస విజయాలతో దూసుకుడు మీదున్న బన్నీకి ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ తప్పింది. బన్నీ తరవాతి సినిమాతో తన సక్సెస్ ట్రాక్ ని మళ్లీ కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడట.
ఇప్పటికే మనం డైరెక్టర్ విక్రమ్ కుమార్ రెండు స్టోరీ లైన్లు వినిపించాడట. కానీ.. బన్నీకి నచ్చలేదట. దర్శకుడు మొదటి స్టోరీని డెవలప్ చేసి వినిపించినా బన్నీకి నచ్చకపోవడంతో విక్రమ్ ఇక రెండో స్టోరీపై దృష్టిపెట్టాడని టాక్. అయితే విక్రమ్ కి కమర్షియల్ సినిమాలో పట్టులోకపోవడంతో బన్నీ, విక్రమ్ తో సినిమా చేయడానికి పలు మార్లు ఆలోచిస్తున్నాడట. రెండవ కథలో మసాల జోడించాలని, మాస్ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండాలని సూచించాడట. బన్నీ సూచనతో కథలో మాస్ అంశాలను జోడించే పనిలో పడ్డాడట విక్రమ్. మాస్ మసాల అంశాలు జోడించాడంటే.. బన్నీ, విక్రమ్ తో సెట్స్ పై వెళ్లినట్లే మరి.
బోయపాటి దర్శకత్వం అల్లు అర్జున్ చేసిన చిత్రం సరైనోడు. మాస్ అంశాలతో తీసిన ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక యూట్యూబ్ లోనే ఇండియన్ సినిమాలోనే అత్యధికంగా ప్రేక్షకులు వీక్షించిన సినిమాగానూ సరికొత్త రికార్డు సృష్టించింది.