కరుణానిధి ఆరోగ్యంపై పుకార్లు…ఖండించిన స్టాలిన్

233
karunanidhi
- Advertisement -

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ,డీఎంకే అధినేత కరుణానిధి (94) పరిస్థితి విషమంగా ఉందన్న వార్తల నేపథ్యంలో వైద్యులు స్పందించారు. కరుణానిధి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు డాక్టర్లు. జ్వరం,మూత్రనాళాల ఇన్ఫెక్షన్‌ కారణంగా కరుణానిధి స్వల్ప అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. త్వరలోనే కొలుకుంటారని చెప్పారు.

కరుణానిధికి ఆయన నివాసంలోనే చికిత్స అందిస్తున్న వైద్యులు ఆయన్ని చూసేందుకు ఎవరిని అనుమతించడం లేదు. మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితి వాకబు చేసుందుకు డీఎంకే శ్రేణులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, మంత్రులు కరుణానిధికి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

తన తండ్రి ఆరోగ్యంపై వస్తున్న వార్తలను స్టాలిన్ ఖండించారు. మూత్రాశయ నాళంలో ఇన్ఫెక్షన్‌ కారణంగా జ్వరంతో బాధపడుతున్నారని, ప్రస్తుతం ఇంట్లోనే వైద్య చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అభిమానులు ఎవరూ రావొద్దని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తెలిపారు. కొన్ని నెలల క్రితం కూడా కరుణానిధి అస్వస్థతకు గురయ్యారు. రెండు నెలల ట్రీట్ మెంట్ తర్వాత ఆయన కోలుకున్నారు.

- Advertisement -