విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ ఐకాన్ గా మారిపోయాడు. అతను ఏంచేసినా అదే ట్రెండ్ అయిపోతుంది. ఇటివలే రౌడీ క్లబ్ పేరుతో దుస్తువుల వ్యాపారం లోకి అడుగు పెట్టగా..తనకు వచ్చిన ఫిల్మ్ ఫేర్ అవార్డును సీఎం రీలిప్ ఫండ్ కు విరాళంగా ఇచ్చేశాడు. దింతో యూత్ ఐకాన్ గా నిలుస్తున్నాడు.
తాజాగా విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమా టీజర్ తో అందరిని అలరిస్తున్నాడు. ఈటీజర్ కు ప్రేక్షకులనుంచి మంచి స్పందన వస్తుంది.ఇటివలే విడుదలయిన ఈసినిమాలోని ఓపాట మైమరిసిస్తుంది. ఈసినిమాతో విజయ్ దేవరకొండ మరోసారి రికార్డు కొట్టడం ఖాయం అనుకుంటున్నారు ప్రేక్షకులు. ఈసినిమాతో సింగర్ గా మారాడు విజయ్ దేవరకొండ.
ఈమూవీలో ఓ పాటను కూడా పాడాడు. విజయ్ పాడిన పాటను నేడు విడుదల చేయనున్నట్లు తెలిపారు చిత్రబృందం. ఈమూవీలో విజయ్ దేవరకొండ కొత్త లుక్ ని చూస్తారన్నారు దర్శకుడు. విజయ్ కి ఎక్కువగా యూత్ లో ఫాలోయింగ్ ఉండటంతో ఆయనతో ఈపాట పాడిస్తే బాగా ఫేమస్ అవుతుందనుకుని ఈపాటను పాడించారు. అల్లు అరవింద్ ఈసినిమాకు నిర్మాతగా వ్యవహిరించారు. ఆగస్ట్ 7 న ఈమూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.