తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త మలుపు తీసుకువచ్చిన దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో ప్రపంచ దేశాలకు తెలుగు సినిమా సత్తా చూపించారు. అయితే ఆయన ఈ సినిమా కోసం ఎంతగా కష్టపడ్డారో తెలిసిందే. నాలుగు సంవత్సరాలుగా ఓకే ప్రాజెక్టుపై దృష్టి పెట్టి అద్భతమైన చిత్రాన్ని రూపొందించారు. బాహుబలికి ఆయన సతీమణి రమా కూడా రాజమౌళికి సమానంగా కష్టపడిందనే చెప్పాలి. కాస్ట్యూమ్, మేకప్ వంటి విషయాలపై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. భర్తకి తోడు, నిడగా ఉంటూ సినిమా విజయానికి తను కూడా కృషి చేసింది.
రాజమౌళి దంపతులు ఎంత అన్యోన్యంగా ఉంటారో బాహుబలి చిత్రబృందానికి తెలుసు. ఆయన భార్యపై ఎనలేని ప్రేమ చూపిస్తారు. ఇక బాహుబలితో ఎన్నో అవార్డులు అందుకున్నా.. ఇంకా ఏదో ఒక చిత్ర పరిశ్రమ నుంచి ఆయన అవార్డులు అందుకుంటూనే ఉన్నారు. ఇటీవలె బి హైండ్ వుడ్స్ గోల్డ్ మెడల్ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి బంగారు పతకం అందుకున్నారు. వ్యాఖ్యాతలు ఆయన సతీమణి రమాను కూడా స్టేజిపైకి రావాలని కోరారు. ఆమెకు వారి భాష అర్థం కాకపోవడంతో అలాగే ఉండిపోయింది.
వెంటనే రాజమౌళి ‘స్టేజిపైకి రమ్మంటున్నారు చిన్నీ’ అంటూ భార్యను ప్రేమగా పిలిచారు. రమా వెళ్తుండగా.. అక్కడే ఉన్న అనుష్క ఫోటోలు తీసింది. ఈ వీడియోని బిహైండ్ వుడ్స్ తాజాగా యూట్యూబ్ లో విడుదల చేసింది. ఈ వీడియోని చూసిన దర్శకధీరుడి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఒక్క లుక్కెయ్యండి మరి.