ఆరు సంవత్సరాలు కష్టపడ్డారు.. రాత్రి, పగలు అని తేడా లేకుండా పని చేశారు. కానీ చివరకు వారు ఊహించని విధంగా నష్టపోయారు. చైనాకు చెందిన ‘అలీబాబా పిక్చర్స్ సంస్థ’ ‘అసుర’ అనే సినిమాను రూ. 700 కోట్లు ఖర్చు చేసి.. భారీ స్పెషల్ ఎఫెక్ట్స్ వాడి.. భారీ అంచనాలతో శుక్రవారం సినిమాను విడుదల చేసింది. కానీ చిత్ర బృందానికి కలలో కూడా ఊహించని షాక్ తగిలింగింది. వారం తిరగకముందే పలు థియేటర్లు.. ఈ సినిమాను ప్రదర్శించలేమంటూ తొలిగించారు. ఈ సినిమా చూడాలని అనుకునే వారు తమను క్షమించాలని.. ప్రేక్షకాదరణ లేకపోవడం వలనే సినిమాను తొలగిస్తున్నామని తెలిపారు.
హాంగ్ కాంగ్ కు చెందిన టోనీ కాఫాయ్ కథానాయకుడిగా.. కరీనా లౌ కథానాయికగా నటించిన ఈ సినిమా తొలి వారంలో కేవలం 7.3 మిలియన్ డాలర్లు మాత్రమే రాబట్టింది. ఈ సినిమా నిర్మాతలు 106 మిలియన్ డాలర్లు నష్టపోయారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత చెత్త సినిమాల జాబితాలో ఐదవ స్థానంలో నిలిచి ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. చైనా సినీ చరిత్రలోనే అత్యంత చెత్త సినిమాగా నిలిచింది.
అసుర సినిమా బడ్జెట్ లోని సగం బడ్జెట్ కూడా చైనా సినిమాలకు ఇప్పటి వరకు ఏ సినిమాకు పెట్టలేదట. తొలిసారిగా భారీ బడ్జెత్ తో తెరకెక్కిన చైనా సినిమా అట్టర్ ప్లాఫ్ అయింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. చైనా సంస్కృతి, సంప్రదాయాలను పెద్దపీట వేస్తూ ఈ సినిమా తెరకెక్కించడంతో.. ప్రేక్షకులకు ఆకట్టకుంటుందని భావించామని, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదని యాంగ్ హోంగ్ టావో అనే నిర్మాత తెలిపాడు.