ఒక్క స్టూడెంట్.. ఒకే టీచర్.. ఖర్చు రూ.8.5 లక్షలు

211
Haryana govt girls' school
- Advertisement -

ప్రభుత్వ పాఠశాలలో రోజు రోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. పాఠశాలల కోసం ప్రభుత్వం ప్రతిఏటా వేల కోట్లు ఖర్చు చేస్తున్నా.. విద్యార్థుల సంఖ్య మాత్రం తగ్గుతూనే వస్తోంది. హర్యానా రాష్ట్రంలోని లుఖి గ్రామంలోని బాలికల ఉన్నత పాఠశాల ఘటనను ఉదాహరణ చెప్పుకొవచ్చు. ప్రస్తుతం ఈ బాలకల పాఠశాలలో ఒకే విద్యార్థిని.. ఒకే టీచర్ ఉన్నారు. కుసుమ కుమారి అనే విద్యార్థిని అందులో ఏడవ తరగతి చదువుతోంది. ఇక సోషల్ టీచర్ దయా కిషన్.. ఆ విద్యార్థినికి అన్ని సబ్జెక్టులు బోధిస్తున్నాడు.

This Haryana govt girls' school has 1 Student

2016-17 విద్యా సంవత్పరంలో 22 మంది విద్యార్థునుల ఉండగా.. 2017-18 విద్యా సంవత్సరంలో మాత్రం కుసుమ కుమారి విద్యార్థిని మాత్రమే స్కూల్ కి వస్తోంది. ఈ పాఠశాలలో మూడు గదులు ఉండగా.. వాటిని స్టోరీజీకి వాడుతున్నారు. ఆ విద్యార్థినికి పాఠశాల ఆవరణలోనే పాఠాలు బోధిస్తున్నాడు కిషన్ మాస్టర్. ఈ పాఠశాలకు ఆ విద్యార్థిని తల్లి.. పాఠశాల విద్యార్థునిలకు మధ్యాహ్న భోజనం చేస్తుంది. మరో విషయం ఏంటంటే ఈ ఉపాధ్యాయుడి నెల జీతం రూ.70 వేలు.

ఈ సందర్భంగా దయా కిషన్ ఉపాధ్యాయుడు మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థినిలు లేని ఈ పాఠశాలను మూసివేసి ఆ విద్యార్థినిని వేరే పాఠశాలకు పంపంచాలని విద్యాశాఖ అధికారులకు చెప్పిన్పటికీ పట్టించుకోవడం లేదని చెప్పారు. ఈ ప్రతి ఏటా ఈ పాఠశాల కోసం ప్రభుత్వం రూ.8.5 లక్షలు ఖర్చుపెడుతోందని కిషన్ అన్నారు. విద్యార్థులు లేని ఈ పాఠశాలకు ఇంత డబ్బు ఖర్చు చేయడం అవసరమా..? అని ప్రశ్నించారు.

- Advertisement -