ఓ ప్రేమోన్మాది అనుమానానికి బలైపోయింది ఓ యువతి. ప్రేమించిన లవరే ఆ యువతిని హత్య చేసి మృగంలా మారాడు. ఈ దారుణమైన ఘటన హర్యానా లోని పానిపట్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పానిపట్ కు చెందిన రాఖీ అనే యువకుడు కాస్మోటిక్ షాప్ లో పని చేస్తున్నాడు. గతకొంతకాలంగా తన స్నేహితుడి సోదరిని ప్రేమిస్తున్నాడు. ఇదే క్రమంలో మే 13న రాఖీ లవర్ మిస్పైంది.
తమ అమ్మాయిని రాఖీ తీసుకెళ్లాడని, పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ అమ్మాయి తల్లిదండ్రులు. ఈ విషయంపై రాఖీని వ్యతిరేకించిన మహేంద్ర అనే మిత్రుడి జిమ్ కి నిప్పంటించాడు. ఈ ఘటనను వీడియో తీసి, వాట్సాప్ లో షేర్ చేస్తూ అందరికి ఇదే నా హెచ్చరిక అని తెలిపాడు. అంతకు ముందే మే 11న రాజన్ అనే మరో మిత్రుడిపై కాల్పులు జరిపాడు. అదృష్టవశాతు రాజన్ ప్రాణాలతో బయటపడ్డాడు.
ఆ యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టగా.. ఆ యువతిని తన లవర్ రాఖీనే చంపి ఓ బావిలో పడేసినట్లు గుర్తించారు. నిందితుడి కోసం పోలీసులు రంగంలోకి దిగగా.. పోలీసులపై కూడా కాల్పులు జరిపాడు. ఈ కాల్పులో ఓ పోలీస్ అధికారి చనిపోగా.. నిందితుడికి కాలు విరిగింది. మొత్తానికి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.