మొహాలీ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో న్యూజీలాండ్ 49.4 ఓవర్లకు 285 పరుగులకు ఆలౌటయ్యింది. మొదట టాస్ గెలిచిన ధోనీ.. న్యూజిలాండ్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించాడు. బ్యాటింగ్‌కి దిగిన న్యూజీలాండ్ ధాటిగానే బ్యాటింగ్ చేసింది. 6.4 ఓవర్ లో ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో గుప్తిల్ మొదటి వికెట్‌గా వెనుదిరిగాడు. మొత్తం 21 బంతులు ఆడిన గుప్తిల్ 27 పరుగులు చేశాడు. 80 పరుగుల వద్ద 12 వ ఓవర్ చివరి బంతికి జాదవ్ బౌలింగ్ లో విలియమ్ సన్ (22) రెండవ వికెట్‌గా అవుటయ్యాడు.
ఆ తరువాత వచ్చిన రాస్ టేలర్ నిలకడగా ఆడి 153 పరుగుల వద్ద స్పిన్నర్ అమిత్ మిశ్రా బౌలింగ్‌లో క్రీజు వెలుపలకి వచ్చి ఆడే ప్రయత్నంలో స్టంపౌటయ్యాడు. కోరె అండర్సన్ (6) కేదార్ జాదవ్ బౌలింగ్‌లో రహానెకి సునాయాస క్యాచ్ ఇచ్చి ఔటైపోయాడు. ఈ దశలో క్రీజులో వచ్చిన లూక్ రోంచి (1) కూడా ధోని మెరుపు కీపింగ్‌తో స్టంపౌటవగా.. అర్ధశతకం సాధించిన టామ్ లాథమ్‌ని (61)ని కేదార్ జాదవ్ బుట్టలో వేసేశాడు. దీంతో 153 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. మూడు ఓవర్ల వ్యవధిలోనే 169/6తో ఒత్తిడిలో నిలిచింది. భారత్ స్పిన్నర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయి 37.5 ఓవర్లకి 199/8తో కష్టాల్లో నిలిచింది. అయితే మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ నీషమ్ (20 నాటౌట్: 24 బంతుల్లో 2×4) నిలకడగా ఆడుతూ మాట్ హెన్రీతో కివీస్‌ను 200 పరుగుల మైలురాయిని దాటించాడు. ఆ తరువాత భారత బౌలర్లకు పరీక్ష పెట్టాడు నీషమ్. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ఓ దశలో స్కోరు 300 పరుగుల వైపు పోతున్న దశలో ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో నషీం(57) జాదవ్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తరువాత వచ్చిన బౌల్ట్ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 39 పరులుగు చేసిన హెన్రీ నాటౌట్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లు ఎవరెన్ని వికెట్లు తీసుకున్నారంటే..యాదవ్ -3, బుమ్రా – 2, జాదవ్ -3, మిశ్రా -2 వికెట్లు తీసుకున్నారు.కాగా, 286 పరుగుల లక్ష్యంతో టీమిండియా మరికొద్ది సేపట్లో బరిలోకి దిగనుంది.