ఆడాళ్లు.. మీకు జోహర్లంటున్న వెంకీ!

274
Aadavaallu Meeku Joharlu
- Advertisement -

బాబు బంగారం సినిమా విజయంతో జోష్ మీదున్న విక్టరీ వెంకటేష్ … బాలీవుడ్ మూవీ సాలా ఖద్దూస్ కి తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకీ బాక్సర్‌గా సరికొత్త లుక్‌లో కనపడనున్నాడు. ఇప్పటికే గురు సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి లేదా అంతకంటే ముందుకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని వెంకీ ఆలోచన.

ఇక తన తరువాత సినిమాను వెంకీ ఫిక్స్ చేసుకున్నాడు. నేను శైలజ మూవీ డైరెక్టర్ కిషోర్ తిరుమల తో రొమాంటిక్ కామెడీ సినిమాలో చేయనున్నాడు . అయితే ఈ సారి వెంకీ నలుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడట.

online news portal

ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా నిత్యమీనన్ ని కన్ఫామ్‌ చేసారని… మిగతా ముగ్గురు భామలు అనసూయ, సింగర్ సునీత, తేజశ్వి మడివాడ వెంకీతో జోడీ కట్టనున్నారని సమాచారం. అయితే తేజస్వి లాంటి టీనేజ్ బ్యూటీ వెంకీ పక్కన హీరోయిన్ గా సూట్ అవుతుందా అని అనుమానం అక్కర్లేదు. స్టొరీ ప్రకారం వెంకీ ఈ మూవీలో తన కంటే వయసులో చాలా చిన్నదైన అమ్మాయిని చేసుకోవాల్సి వస్తుందట. అందుకే ఆ క్యారెక్టర్ కోసం తేజస్విని తీసుకున్నారట. జబర్దస్థ్ తో పాపులార్ అయిన అనసూయ… ఇటీవలే నాగార్జున సరసన సొగ్గడే చిన్నినాయన సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించింది. మరి ఈ సినిమాలో వెంకీ సరసన అనసూయ ఏవిధంగా అలరిస్తుందో సినిమా వచ్చే అంత వరకు వేచి చూడాల్సిందే తప్పదు. సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడా అని ఎదురుచూసే సింగర్‌ సునీత అభిమానులకు ఈ సినిమా స్పెషల్ అవుతుందని ఫిల్మ్‌నగర్‌ వర్గాల టాక్‌.

online news portal

ప్రస్తుతం దర్శకుడు కిశోర్ తిరుమల ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాడట. రాధా మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు అనేసరికి ఈ సినిమా మీద భారీ అంచనాలే ఏర్పడ్డాయి. హీరో వెంకటేష్ ఈ నలుగురు ముద్దుగుమ్మల తో చేసే రొమాన్స్ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. కిశోర్ తిరుమల కూడా ఈ ప్రాజెక్ట్ మీద మంచి నమ్మకంతో ఉన్నాడట. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది.

- Advertisement -