తెలంగాణలో జడివాన..జలకళ

251
heavy rain in telangana
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు చోట్ల నిన్న రాత్రి నుంచి వాన‌లు దంచి కొడుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఎడ‌తెర‌పిలేని వ‌ర్షం కురుస్తోంది. గ‌త రాత్రి హైద‌రాబాద్, రంగారెడ్డి, మేడ్చ‌ల్ జిల్లాలో మోస్త‌రు వ‌ర్షం కురుస్తుంది. దింతో ప‌లు చోట్ల ట్రాఫిక్ కు అంత‌రాయం క‌లుగుతుంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల‌కు లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. నగరంలోని మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, సైదాబాద్, చంపాపేటతో పాటు పలు చోట్ల ఈ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. హైద‌రాబాద్ లో జిహెచ్ ఎంసీ అధికారులు ప‌లు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ప్ర‌జ‌ల‌కు ఎటువంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకొవాల‌ని మంత్రి కేటీఆర్ అధికారుల‌కు సూచించారు.

HYD rain

ఇక రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో కూడా వ‌ర్షం ప‌డుతోంది. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని సూర్య‌పేట‌, భువ‌న‌గిరి, ఆలేరులో ఎడతెర‌పి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం , వ‌రంగ‌ల్, భూపాల‌ప‌ల్లి జిల్లాలో నిన్న రాత్రి నుంచి మోస్త‌రు వ‌ర్షం ప‌డుతుంది. భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం వద్ద నీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతుందది. వర్షం కారణంగా మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్, కన్నెపల్లి పంప్‌హౌజ్, గ్రావిటీ కెనాలు వద్ద ఏడో రోజు పనులు నిలిచిపోయాయి.

hyd rain

మ‌రోవైపు మ‌హారాష్ట్ర‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు ప్రాజెక్టులన్ని జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. గోదావ‌రి న‌దీ ప‌రివాహాక ప్రాంతంలో కురుస్తున్న వ‌ర్షాల‌కు వ‌ర‌ద నీరు మ‌రితం ఎక్కువైంది. దీంతో తెలంగాణ‌లోని ప‌లు ప్రాజెక్టుల గేట్ల‌ను తెరిచారు అధికారులు. క‌డెం ప్రాజెక్టు కు చెందిన మూడు గేట్ల‌ను వ‌దిలిపెట్టారు. భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి నీటిమ‌ట్టం మ‌రింత పెరిగింది. భారీ వ‌ర్షాలు ప‌డ‌టంతో చెరువులు, కాలువ‌లు అన్ని జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. వర్షం కారణంగా మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్, కన్నెపల్లి పంప్‌హౌజ్, గ్రావిటీ కెనాలు వద్ద పనులు నిలిచిపోయాయి.

- Advertisement -