భారీ స్థాయిలో బొటానిక‌ల్ గార్డెన్ అభివృద్ది..

213
Minister Indrakaran Reddy
- Advertisement -

కాంక్రిట్ జంగిల్‌గా మారిన హైటెక్‌ సిటీ ప్రాంతంలో పచ్చదనంతో నిండిన బొటానికల్ గార్డెన్‌లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు కొన‌సాగుతున్నాయ‌ని గృహ నిర్మాణ‌,న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. కొత్తగూడ బొటానికల్ గార్డెన్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప‌రిశీలించారు. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు రాజీవ్ శ‌ర్మ‌, పీసీసీఎఫ్ ప్రశాంత్ కుమార్ ఝా,అటవీ అభివృద్ధి సంస్థ ఎండీ చందన్ మిశ్రాతో క‌లిసి వెదురు ఉత్ప‌త్తుల‌తో నిర్మించిన అట‌వీ శాఖ కార్యాల‌యం, ప‌ర్యావ‌ర‌ణ విజ్ఞాన కేంద్రం ఎడారి మొక్క‌ల‌ను పెంచిన కాక్ట‌స్ గార్డ‌న్, బ‌ట్ట‌ర్ ఫ్లై పార్క్ ను సంద‌ర్శించారు.

Minister Indrakaran Reddy

అనంత‌రం దాదాపు రూ. 5 కోట్ల నిధులతో భారీ స్థాయిలో గార్డెన్‌ను దశలవారీగా అభివృద్ధి చేస్తున్న యోగా షెడ్, టెంట్ , ట్రీ కాటేజ్, లాగ్ హ‌ట్, వాక‌ర్స్ పార్క్, చిన్న పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా నిర్మిస్తున్న వీడియో హాల్, ఇండోర్,అవుట్ డోర్ అభివృద్ది ప‌నుల గురించి మంత్రి ఇంద్ర‌క‌ణ్ రెడ్డికి వివ‌రించారు. త్వ‌ర‌లోనే వీటిని అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు అధికారులు తెలిపారు.

Minister Indrakaran Reddy

ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ… సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆలోచన మేరకు అటవీ సంపదను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం ముందుకుసాగుతుంద‌న్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు బొటానిక‌ల్ గార్డ‌న్ అభివృద్ది ప‌నుల‌ను పరిశీలించినట్లు వెల్ల‌డించారు. గతంలో ప్రైవేట్ ఆధీనంలో ఉన్న బొటానికల్ గార్డెన్ కళాహీనంగా మారిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ఆదేశాల మ‌ర‌కు అటవీ అభివృద్ధి సంస్థ ప‌లు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింద‌న్నారు. అటవీ అభివృద్ధి సంస్థ ఆద్వ‌ర్యంలో సహజత్వం దెబ్బతినకుండా ప్రత్యేకంగా ఎకో ఫెండ్లీ నిర్మాణాలు చేపడుతున్నార‌ని వెల్ల‌డించారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వెంట బొటానిక‌ల్ గార్డెన్ వాక‌ర్స్ అసోసియేష‌న్ ప్ర‌తినిదుల‌ కూడా ఉన్నారు.

Minister Indrakaran Reddy

- Advertisement -