6 నెలలు సరిపోదు.. జీవితకాలం విధించండి..

219
Raja_Singh
- Advertisement -

హిందూవుల ఆరాధ్య దేవుడు శ్రీరాముడిపై కత్తిమహేష్‌ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హైదరాబాద్ నుంచి 6 నెలల పాటు బహిష్కరణ విధించిన సంగతి తెలిసిందే. ఒక వేళ అతిక్రమించి వస్తే మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి వస్తోందని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చిరించారు. ఏ వ్యక్తి అయినా.. ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు.

Kathi mahesh and raja sing

తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. కత్తి మహేష్ కి ఆరు నెలల బహిష్కరణ సరిపోదని.. శాశ్వతంగా హైదరాబాద్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. హిందూవులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఇక స్వామి పరిపూర్ణానందను కలిసేందుకు తనను అనుమతించలేదని పోలీసులను తీరును తప్పు బట్టారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

మరో బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. శాంతియుతంగా ధర్మాగ్రహ యాత్ర చేపట్టదలచిన స్వామి పరిపూర్ణాందను హౌస్ అరెస్ట్ చేయడం దారుణమన్నారు. రెచ్చగొట్టే విధంగా మాట్లాడే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోరని మండిపడ్డారు.

- Advertisement -